పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులును ఎంఈఓ కాశప్ప ఆదేశించారు. యాడికి లోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం హెచ్ ఎం లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీవో వీర్రాజుతో కలిసి మాట్లాడారు. కొన్ని పాఠశాలలను అధికారులు దత్తత తీసుకున్నారన్నారు. ఆ పాఠశాలల్లో కూడా ఉత్తీర్ణత నూరు శాతం ఉండాలన్నారు. స్టడీ అవర్స్ ఇప్పటినుంచే మొదలు పెట్టాలన్నారు.