మంగళగిరి: తాడేపల్లి హైవే పోలీస్ చెక్ పోస్ట్ పై ఉరి వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి
జిల్లాలోని తాడేపల్లి మంగళగిరి హైవే పై ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ కు ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అటుగా ప్రయాణం చేస్తున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతుడు ఆచూకీ తెలిసినవారు తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని సోమవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా సూచించారు.