ఆమదాలవలస: రేగిడి మండలం పెద్ద సిర్లం గ్రామానికి చెందిన అప్పలనాయుడు ఇనుప ముక్కల వ్యాపారానికి ఒడిస్సా వెళ్లి అస్వస్థతకు గురై మృతి
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పెద్దశిర్లాం గ్రామానికి చెందిన అప్పలనాయుడు(35) ఇనుప ముక్కల (స్క్రాప్) వ్యాపారానికి గ్రామానికి చెందిన 13 మంది యువకులతో కలిసి ఇటీవల ఒడిశాలోని మల్కాన్ గిరి వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం మల్కాన్ గిరి నుంచి తన ద్విచక్రవాహనంపై సమీపంలోని గూడాలకు వెళ్లే క్రమంలో ఎండలో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం కుప్పకూలి చనిపోయినట్లు స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది...