దర్శి: దొనకొండ మండలంలో సాగర్ కాలవపై కూలిపోయిన బ్రిడ్జి ఇబ్బందులు పడుతున్న రైతులు
Darsi, Prakasam | Nov 11, 2025 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం దేశి రెడ్డిపల్లి, చందవరం గ్రామాల రైతులు సాగర్ కాలవపై బ్రిడ్జి కూలిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన పడిపోయిన బ్రిడ్జిపై తప్పని పరిస్థితులలో రైతులు వెళ్లి పంట సాగు చేసుకుంటున్నారు. బ్రిడ్జి అవతల వైపు సుమారు 1200 ఎకరాల పంట భూమి ఉండడంతో కొందరు సాగు చేస్తున్నారు మరి కొందరు సాగు చేయటం లేదని రైతుల అన్నారు. కొందరు కాలువలో పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు.