గద్వాల్: డిజిటల్ లైబ్రరీ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాట్లు చేయాలి:కలెక్టర్ బి.యం.సంతోష్ కుమార్
మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయ భవనంలో తాత్కాలిక డిజిటల్ లైబ్రరీ, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలాబి.ఎస్.యన్.ఎల్ కార్యాలయ భవనంలో డిజిటల్ లైబ్రరీ,గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన పనులను చేపట్టాలన్నారు. భవన వసతులు పరిశీలించి, అవసరమైన సౌకర్యాలను సమకూర్చాలని సూచించారు. అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేసి, కావలసిన పరికరాలు, సామగ్రి,మౌలిక వసతులను సమకూర్చాలని ఆదేశించారు.