కేంద్ర ప్రభుత్వం గిరిజనులు ఆదివాసుల పైన అవలంబిస్తున్న వైఖరి పట్ల పీలేరు మండలం పీలేరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు గిరిజన యానాది సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కిల్లా విజయ్ కుమార్, పీలేరు నియోజకవర్గ అధ్యక్షులు వెంకటగిరి రాజేష్ అధ్యక్షతన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ శక్తుల లబ్ధి కొరకై అటవీ సంపద అయిన కలప, ఖనిజాలు దోపిడీకి గురవుతున్న సందర్భాల్లో అటవీ సంపద,అటవికులైన ఆదివాసి గిరిజనులకే చెందాలన్నారు.