నంద్యాల టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ గా విజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
Nandyal Urban, Nandyal | Sep 17, 2025
నంద్యాల జిల్లా టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్గా విజయ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం టైగర్ ప్రాజెక్ట్ కార్యాలయంలో విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశానుసారం టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్గా విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేస్తానని వెల్లడించారు. సిబ్బంది సహకారంతో, అందరినీ సమన్వయం చేసుకొని పని చేస్తామన్నారు.