పిఠాపురం మాజీ ఎంపీ వైసిపి ఇంచార్జ్ వంగా గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ అభివృద్ధిపై సవాల్ విసిరారు.
వంగా గీతకు సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి నాలుగు నియోజకవర్గాల రైతులకు ఇబ్బందులు కలిగించారని, రైతులకు అండగా నిలిచేది కేవలం టీడీపీ ప్రభుత్వమేనని వర్మ అన్నారు.