పుట్టపర్తిలో టిడిపిలో వివిధ పదవులు పొందిన నేతల ప్రమాణస్వీకారం
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ పదవులు పొందిన నేతలు బుధవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని, పార్టీ పదవులు లభిస్తాయని అన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.