యాడికి మండల కేంద్రంలో వెలిసియున్న అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అర్చనలు, అభిషేకాలు, హారతి వంటి పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప, భవాని, ఆంజనేయస్వామి మాలాధారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.