హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ మేరకు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పందిల్ల జాతీయ రహదారి పై నిర్మిస్తున్న బ్రిడ్జి ను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణం త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం వర్షాకాలంలో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తా మున్సిపల్ కాంప్లెక్స్ ముందు ప్రజలతో కలిసి చాయ్ తాగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు..