వాంకిడి మండల కేంద్రంలో వారం రోజులుగా HP గ్యాస్ సిలిండర్ల కొరతతో నిరుపేద వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నామని గ్యాస్ వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ కోసం వస్తే సిబ్బంది తలుపు తెరవడం లేదని, సిలిండర్లను మాత్రం బ్లాక్లో అమ్ముతున్నారని బుధవారం సాయంత్రం 4గంటలకు వినియోగదారుడు ఆరోపించాడు. అధికారులు తక్షణమే స్పందించి, సకాలంలో గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.