నిర్మల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal, Nirmal | Sep 15, 2025 ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అధికారులు అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. అర్జీలు పెండింగ్లో ఉంచకూడదన్నారు. స్వీకరించిన అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు.