సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మైదానంలో జిల్లాస్థాయి ఆత్యా-పాత్యా పోటీలను ఆదివారం నిర్వహించారు. అండర్-17, 19 బాల బాలికల విభాగంలో 20 మండలాల నుంచి 82 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షుడు విజయ్ నాయక తెలిపారు.