సత్యసాయి జిల్లాలో 434.2 మి.మీ వర్షపాతం నమోదు
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 434.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టరేట్ కార్యాలయం అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిస్తే నా వర్షపాత వివరాలు వెల్లడించిన అధికారులు జిల్లాలోని 32 మండలాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయని పేర్కొన్నారు. అత్యధికంగా కనగానపల్లె 29.8, నల్లమాడ 28.0, తాడిమర్రి 25.0, ఎన్పీ కుంట 22.4, సీకేపల్లి 22.2, రామగిరి 20.8, రొద్దం మండలంలో 20.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.