రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సూరమ్మ పండుగలో రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతరం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి వారి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మహా అన్నదానాన్ని ప్రారంభించారు.. వారు మాట్లాడుతూ తన చిన్ననాటి నుంచి సూరమ్మ పండుగలో పాల్గొనే వాడినని గుర్తు చేశారు.ఆ సూరమ్మ అమ్మ వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.