రాజంపేట భవిష్యత్తు కోసం తప్పనిసరిగా జిల్లా కేంద్రం చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి కుమార్ డిమాండ్ చేశారు అన్నమయ్య జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కావాల్సిన తాగు సాగునీరు రాజంపేటలో పుష్కలంగా ఉందని చెప్పారు. అధికారులు ప్రజలు రావడానికి పోవడానికి రైలు మార్గం విమానాశ్రయము కనెక్టివిటీ కలిగి ఉందని చెప్పారు.