గోరంట్లలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్, రూ. 7,50,000 నగదు ఒక కారు స్వాధీనం
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 7,50, 000 రూపాయలు నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. సోమవారం మధ్యాహ్నం ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో డి.ఎస్.పి నర్సింగప్ప విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలసముద్రం క్రాస్ వద్ద ఒక హోటల్ లో అనుమానాస్పద 6 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారిని విచారించగా గోరంట్ల పట్టణంలో జరిగిన చోరీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.