ఉదయగిరి: రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉదయగిరిలో జిఎస్టి ఉత్సవ్ పై అవగాహన కార్యక్రమం
ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు కావలి రవాణా శాఖ ఆధ్వర్యంలో GST ఉత్సవ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంచాయతీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రవాణా అధికారి కరుణాకర్ మాట్లాడారు. జీఎస్టీ తగ్గిన తర్వాత వాహనాలను ఎంత ధరలకు కొనుగోలు చేసుకున్నారో, లబ్ధిదారులు ఎంత లబ్ధి పొందారో అడిగి తెలుసుకున్నారు.