తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సీఐ శివ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివగంగాధర్ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు గురించి తెలుసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, తాగి డ్రైవ్ చేయడం, సెల్ఫోన్ డ్రైవ్ చేయడం మానుకోవాలన్నారు. రోడ్డు నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చునన్నారు. అనంతరం రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లను పోలీసులతో కలిసి ఆవిష్కరించారు.