అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో లావణ్య అనే మహిళ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన లావణ్య గత కొన్ని నెలలుగా అనారోగ్యసమస్యలతో పాటుగా కుటుంబసమస్యలతో బాధపడుతుండేది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో విష ద్రావకం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.