దామరచర్ల: దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ జిల్లా దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పార్టీ గురువారం ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తక్షణ చికిత్స అందించేందుకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆస్పత్రికి వచ్చిన వారిని వెంటనే చికిత్స అందించడానికి ఆంటీవీనం ఇతర మందులు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.