ఒంగోలు పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా దీపావళి టపాసుల ప్రదర్శన కార్యక్రమం
Ongole Urban, Prakasam | Oct 19, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన దీపావళి టపాసుల ప్రదర్శన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదివారం పాల్గొన్నారు. జిఎస్టి తగ్గింపులతో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి టపాసుల ముందు సామాగ్రి భారీగా ధరలు తగ్గిపోయాయని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. అంతేకాకుండా ముందస్తు విరమించిన దీపావళి వేడుకలలో జాయింట్ కలెక్టర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.