శ్రీకాకుళం: 14 కిలోల గంజాయితో పలాస రైల్వే స్టేషన్లో జి ఆర్ పి పోలీసులకు పట్టుబడ్డ ఓ మహిళ, కేసు నమోదు చేసిన ఎస్ఐ కోటేశ్వరరావు
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో జి ఆర్ పి ఎస్ ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను అదుపులోకి తీసుకొని ఆమె వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ ను పరిశీలించగా... 14 కిలోల గంజాయి పట్టుబడిందని శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిషేధిత మారక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.