మంత్రాలయం: పెద్ద కడబూరు లో శ్రీ భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కురువ సంఘం ఆధ్వర్యంలో పొట్టేళ్ల పందాలు
పెద్ద కడబూరు: మండల కేంద్రంలో శ్రీ భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టేళ్ల పందాలను టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, మల్లికార్జున ప్రారంభించారు. గ్రామీణ క్రీడలలో భాగమే పొట్టేళ్ల పందేలని గుర్తు చేశారు. ఇందులో గెలుపొందిన పొట్టేళ్లకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నల్ల, నట్టు పొట్టేళ్లకు వేరు వేరుగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.