దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన వ్యక్తి సర్దార్ భగత్ సింగ్ నగరంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హేమశంకర్
Eluru Urban, Eluru | Sep 28, 2025
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) ల ఆధ్వర్యంలో ఆర్.ఆర్. పేట స్పూర్తి భవన్ నందు ఆదివారం సాయంత్రం ఐదు భగత్ సింగ్ 118వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి అమరుడైన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ సర్దార్ షాహిద్ భగత్ సింగ్ అని కొనియాడారు.