గజపతినగరం: డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ తో సమయం, పెట్టుబడి ఆదా: కనిమెరకలో మండల వ్యవసాయాధికారి మల్లికార్జునరావు
బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో మంగళవారం సాయంత్రం మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్ తో జీవామృతం, కషాయం స్ప్రేయింగ్ చేసే విధానాన్ని ప్రయోగాత్మక ప్రదర్శన ద్వారా చేసి చూపించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మల్లికార్జునరావు మాట్లాడుతూ డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేయడం వలన సమయం పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయని అన్నారు. ఏపీ సీఎం అఫ్ వ్యవసాయ అధికారులు ఏడిపిఎం స్వామి నాయుడు రీజినల్ కోఆర్డినేటర్ హేమ సుందర్, ఏ ఈ ఓ లు సంతోష్ సాయిరాం బిందు మహేష్ ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.