ముగ్గురు బాల కార్మికులకు విముక్తి: రేణిగుంట MRO రేణిగుంట(M) గురవరాజుపల్లి ST కాలనీలో ముగ్గురు చిన్నారులతో వెట్టిచాకిరి పనులు చేయిస్తున్నట్లు తాము గుర్తించామని MRO చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ కాలనీకి చెందిన లోకేశ్ బాతుల పెంపకం పేరుతో బాండ్లు రాయించి పిల్లల చేత పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను ఆయన నుంచి విడిపించి ST గురుకుల పాఠశాలలో చేర్పించినట్లు పేర్కొన్నారు. పిల్లల చేత పనులు చేయిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.