యర్రగొండపాలెం: ఉత్తమ కార్యకర్తలందరికీ ప్రశంస పత్రాలను అందజేస్తామని తెలిపిన వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఉత్తమ కార్యకర్తలందరికీ ప్రశంస పత్రాలను అందజేస్తున్నట్లు ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన ఉత్తమ కార్యకర్తలు అందరిని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హృదయపూర్వకంగా ప్రశంసిస్తూ అభినందించినట్లు తెలిపారు. వారి సేవలకు గుర్తింపుగా ప్రశంస పత్రాలను అందజేస్తామన్నారు.