కొండపి: సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఘటనపై విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. పాత గొడవల నేపథ్యంలో ఘర్షణ జరిగినట్లుగా స్థానికుల సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కొంతమంది వ్యక్తులు ఈ ఘటనను మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల ఘటన వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నామని వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.