కృత్తివెన్నులో రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపి మృతి
Machilipatnam South, Krishna | Sep 24, 2025
కృత్తివెన్ను మెయిన్ సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ ఆర్ఎంపీ వైద్యుడు తెలగంశెట్టి వెంకటరమణ నాగేశ్వరరావు(58) మృతి చెందారు. పాలకొల్లు నుంచి విజయవాడ వెళ్తున్న మహీంద్రా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వైద్యం చేసినందుకు డబ్బులు ఆశించని వ్యక్తిగా నాగేశ్వరరావుకు మంచి పేరుంది. ఆయన మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.