నెల్లూరులో కలకలం రేపుతున్న ఐటీ రైడ్స్.. బంగారు బిస్కెట్ల క్రయవిక్రయాలపై అధికారుల గురి
నెల్లూరులోని ఆచారీ వీధిలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి.. రెండు టీమ్స్ గా వచ్చిన ఐటీ అధికారులు.. డిపి గోల్డ్ షాప్ తో పాటు.. ఆయన నివాసంలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.. పలు కీలక రికార్డులను పరిశీలిస్తున్నారు. అతను గోల్డ్ బిస్కెట్స్ వ్యాపారి కావడంతో.. ఇటీవల కాలంలో జరిగిన క్రయ్యవిక్రయాల లెక్కలను పరిశీలిస్తున్నారు. ఉదయాన్నే ఐటి రైట్స్ జరుగుతూ ఉండడంతో వ్యాపారులు షాపులు తీయడానికి జంకుతున్నారు..