రాయల చెరువు గండి ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
రాయలచెరువు గండి ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: ఎమ్మెల్యే కేవీబీ పురం మండలం పాతపాలెంలోని పెద్ద రాయల చెరువు గండితో ఏర్పడ్డ ముంపును ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. సోమవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద రాయల చెరువు ముంపును ప్రకృతి విపత్తుగా ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ గండి వల్ల వందలాది పశువులు చనిపోయాయని, ముంపు గ్రామాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు.