కర్నూలు: విచారణ జరిపి న్యాయం చేస్తాం : కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 102 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, భూ వివాదాలు, స్టాక్ మార్కెట్ మోసం, పామాయిల్ మొక్కల మోసం, లోన్ పేరుతో దివ్యాంగుడితో మోసం, నకిలీ విద్యార్హత పత్రాల వంటి ఫిర్యాదులు నమోదయ్యాయి.ప్రతి కేసును చట్టపరంగా పరి