ఉప్పల్ నియోజకవర్గం ప్రజలు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను పరమేశ్వర్ రెడ్డికి వివరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన పరమేశ్వర్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.