ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సీఎం చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి గిద్దలూరు నియోజకవర్గ పరిస్థితులను అలానే అభివృద్ధికి నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చంద్రబాబును కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉందని గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో అన్నారు.