మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఆరవ రోజు అమ్మవారిని రూ. 11,11,111 రూపాయలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.