మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీలేరులో వైసీపీ శ్రేణులు ర్యాలీ, డిప్యూటీ తహసిల్దార్ కు వినతి
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అధ్యక్షతన పీలేరులో వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీలేరు పట్టణంలోని బోదేశావళి దర్గా నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ శివ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పి పి పి విధానంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అన్నారు.