తైక్వాండో అంతర్జాతీయ పోటీలలో ఆళ్లగడ్డకు చెందిన అక్క చెల్లెల్లు బంగారు, సిల్వర్ మెడల్ సాధించారు
ఆళ్లగడ్డ అరుణోదయ యూపీ స్కూల్కు చెందిన అక్కాచెల్లెళ్లు తైక్వాండో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభకనబరిచి బంగారు, సిల్వర్ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు అమీర్ బాషా, మండల ప్రభుత్వ ఖాజీ షేక్ మహమ్మద్ జాఫర్ మాట్లాడారు. ఈ బాలికలు వ్యక్తిగత ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ఆళ్లగడ్డకు గర్వకారణమని అభినందించారు.