పిఠాపురం ఆటో యూనియన్ నాయకులు కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని డ్రైవర్ దుర్గాప్రసాద్ పెట్రోల్ బాటిల్ తో హల్చల్
ఆటో యూనియన్ నాయకులు కొందరు తనతోపాటు తన కుటుంబాన్ని వేధిస్తూ,తమను రోడ్డున పడేశారని,తనకు న్యాయం చేయకపోతే చావే దిక్కంటూ ఒక ఆటోడ్రైవర్ పెట్రోల్ పోసుకుని,మేడపైనుంచి దూకేస్తానని హల్చల్ చేశాడు.చివరకు పోలీసులు,స్థానికులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆ ఆటోడ్రైవర్ తన యత్నాన్ని విరమించాడు కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్ కు తరలించారు. కాకినాడజిల్లా పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద ఆటోడ్రైవర్ దుర్గాప్రసాద్,అతని కుటుంబ సభ్యులు తో శనివారం మధ్యాహ్నం 11 గంటలకు ఆందోళన చేశారు