సంతనూతలపాడు: సంతనూతలపాడులో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం, విద్యుత్ తీగలపై ఏర్లు పాకిన పిచ్చి మొక్కలను తొలగించాలన్న స్థానికులు
ప్రకాశం జిల్లా సంతానతలపాడు పట్టణంలో ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. స్థానిక ఓ విద్యుత్ స్తంభం పై పిచ్చి మొక్కలు ఏర్లు పాకి ప్రమాదకరంగా తయారయింది. పిచ్చి మొక్కలు విద్యుత్ తీగల కు తాకడం వల్ల విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈ వీడియో తీసి వైరల్ గా మార్చాడు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కరెంటు స్తంభానికి అల్లుకుంటూ ఏర్లు పాకిన పిచ్చి మొక్కలను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.