ఇంద్రవెల్లి: డా.బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ పట్టణంలో అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ నిరసన
రాజ్యసభలో భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బి. ఆర్ అంబేడ్కర్ ను అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి వాగ్మారె కాంరాజ్ అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిరసన తెలిపారు. అనంతరం అమిత్ షా చిత్రపటాన్ని దహనం చేశారు.