బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరణ ప్రకారం ఐడిపిఎల్ లో బస్ స్టాప్ సమీపంలో గఫర్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి రక్తస్రావం కారణంగా గఫర్ ఘటన స్థలంలోని మృతి చెందాడు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.