శామీర్‌పేట: ఏసీబీ అధికారులకు చిక్కిన ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. మున్సిపాలిటీ పరిధిలో ఓ వెంచర్ కు అనుమతులు ఇచ్చేందుకు ఐదు లక్షల లంచాన్ని రాధాకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు 5 లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.