కొలిమిగుండ్ల లో వీధిలైట్లకు మరమ్మత్తులు : సర్పంచ్ శివ రాముడు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని పలు కాలనీలో వీధిలైట్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ జినుగు శివరాముడు సోమవారం వెల్లడించారు. గ్రామంలోని చల్లా కాలనీ, ఎస్సీ కాలనీ, శాంతినగర్, మెయిన్ బజార్, స్కూల్ వీధి తదితర ప్రాంతాల్లో వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్న గ్రామస్థులు మేరకు వీధిలైట్లకు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పలు కాలనీలో వెలుగులు సంతరించుకున్నాయి.