సూళ్లూరుపేటలో రేషన్ పంపిణీ చేసేందుకు అడ్వాన్స్ టెక్నాలజీతో స్వైపింగ్ మిషన్లు పంపిణీ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకే రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ చేసే పాత విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కానీ ఏ ఒక్క రేషన్ షాపులో కూడా మిషన్లు సరిగా పనిచేయడం లేదని, సిగ్నల్స్ లేవని ప్రజలు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండేవారు. అందువలన ప్రభుత్వం నూతన ఆలోచన విధానంతో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన స్వైపింగ్ మిషన్లను రేషన్ షాపులకు సూళ్లూరుపేట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు. దొరవారి సత్రం 41 మిషన్లు, తడ 38 మిషన్లు, సూళ్లూరుపేట 43 మిషన్లు, మూడు మండలాలకు కలిపి మొత్తం 122 మిషన్లను పంపిణీ చేశారు. అవి పని చేసే విధానాన్ని డీలర్లక