ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నంలో అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల PDS బియ్యంను స్వాధీనం చేసుకున్న తహసిల్దార్
ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నంలో 16 క్వింటాళ్ల అక్రమ పీడీఎస్ బియ్యంను తహసీల్దార్ కారం సుబ్బారావు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. ఎటపాక తహసీల్దార్ కారం సుబ్బారావుకు పక్కాగా వచ్చిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి మండల రెవిన్యూ సిబ్బంది దాడిచేసి సుమారు 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించి బియ్యంను సీజ్ చేసి పురుషోత్తపట్నంలో స్టోర్ గదికు తరలించారు. దీనిపై తహసీల్దార్ కారం సుబ్బారావు మాట్లాడుతూ జరిగిన సంఘటన పై విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.