గుత్తిలో బాలకృష్ణ నటించిన అఖండ - 2 సినిమా ప్రదర్శించే కే పీ ఎస్ సినిమా థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. బాలకృష్ణ అభిమాన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఈరన్న గౌడ్, బాలు ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఓం నమశ్శివాయ, జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. అఖండ-2 భారీ విజయాన్ని సాధించాలని శివున్ని పూజించినట్లు అభిమానులు వెల్లడించారు.