దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నూతన ఎస్పీ సతీష్ కుమార్
శ్రీ సత్యసాయి జిల్లా నూతన ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం సాయంత్రం పుట్టపర్తిలో నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దుర్గా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పట్టణంలోని చర్చి, మసీదులకు వెళ్లి ఆయా మత సంప్రదాయాలను గౌరవిస్తూ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.