ప్రొద్దుటూరు: రాజుపాలెం మండలం కుందన్ నదిలో ఆత్మహత్య చేసుకున్న నాగ మునెమ్మ మృతదేహం వెలికితీత
Proddatur, YSR | Oct 26, 2025 కడప జిల్లా రాజుపాలెం మండలం వెళ్లాల సమీపంలోని కుందూ నదిలో శనివారం మధ్యాహ్నం దూకిన నాగమునెమ్మ మృతదేహాన్ని ఆదివారం పవర్ బోట్ సహాయంతో ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వెలికితీసి పోలీసులకు అప్పగించినట్లు ప్రొద్దుటూరు జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి బసివి రెడ్డి తెలిపారు. పెద్దముడియం మండలం ఉప్పలూరుకు చెందిన రామసుబ్బారెడ్డి, భార్య నాగమునెమ్మ శనివారం కుందూ నదిలో దూకారు.రామసుబ్బారెడ్డిని స్థానికులు రక్షించారు. కొంతకాలంగా కుటుంబ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో వృద్ధులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.